అమర గాయకుడు ఘంటసాల జయంతిని విశాఖ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్ఠణంలోని సినీ, రాజకీయ, కళారంగ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఘంటసాల ఎనలేని సేవ చేశారని వారు పేర్కొన్నారు. విశాఖలో ఘంటసాల పేరిట ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపకుడు చెన్నా తిరుమలరావు కోరారు.
ఇవీ చదవండి..