భారత నౌకాదళం నౌకలు సహ్యాద్రి, కోరా ఉత్తమ నౌకలుగా ఎంపికయ్యాయి. ఫ్లీట్ అవార్డ్ ఉత్సవం (ఎఫ్ఎఎఫ్) 2020 విశాఖపట్నంలోని నావికాదళ ప్రధాన స్థావరమైన తూర్పునౌకాదళంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ హాజరయ్యారు.
సముద్రసేతు విజయవంతం
కొవిడ్ సమస్య ఎదుర్కొంటున్నప్పటికి తూర్పు నౌకాదళంలో ఉన్న నౌకల కార్యకలాపాల నిత్యం కొనసాగేలా తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సర నివేదిక కార్యకలాపాల అంశాలను పరిశీలించి ఆమోదం తెలిపారు. ఆపరేషన్ ‘సముద్ర సేతు’ కింద భారత నుంచి వివిధ దేశాలకు వెళ్లి కొవిడ్ వల్ల చిక్కుకుపోయిన వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో నౌకాదళ నౌకలు విజయవంతమయ్యాయని ఆయన అన్నారు.
వివిధ కార్యాచరణ పనులలో రాణించినందుకు గుర్తింపుగా 16 ట్రోఫీలను ప్రదానం చేశారు. ఉత్తమ నౌకల విభాగంలో.. క్యాపిటల్ షిప్‌లలో ఐఎన్ఎస్ సహ్యాద్రి , కొర్వెట్టిలలో ఐఎన్ఎస్ కొరాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఐరావత్, కిల్తాన్లకు సంయుక్తంగా ‘బెస్ట్ స్పిరిటేడ్ షిప్’ టైటిల్ను సాధించాయి.
ఇదీ చదవండి: ఔషధ మెుక్కలు సాగుచేస్తూ పురాతన వైద్యమందిస్తున్నాడీ యువకుడు!