సామాన్యులకు ప్రియమైన కోడిగుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. ఆమాంతం ఆరు రూపాయులై కూర్చుంది. ఇపుడు మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా గుడ్లు వైపు దృష్టి సారించటంతో.. ఒక్కసారిగా వీటి అమ్మకాలు పెరిగాయి. దానికి తోడు గుడ్లు ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేదు. కొవిడ్-19 పేరిట ప్రారంభంలో కోడి మాంసంతో పాటు గుడ్డుపైన అపోహాలేర్పడ్డాయి.
వీటి అమ్మకాలు బాగా పడిపోయాయి. పౌల్ట్రీ యాజమానులు ఇబ్బందులను చవిచూశారు. అప్పట్లో గుడ్డు ధరను తగ్గించి మరీ అమ్మకాలు చేశారు. తాజాగా మార్కెట్లో గుడ్డు ధర పెరిగినా వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడంతో అమ్మకాలు బాగానే ఉన్నాయని చోడవరానికి చెందిన కోడిగుడ్ల వ్యాపారి నాగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. చోడవరంలో ప్రస్తుతంం 35 వేలకుపైగా గుడ్డు అమ్మకాలు సాగుతున్నాయి.
ఇదీ చదవండి:
రోడ్లపైనే పాఠాలు.. ఆన్లైన్ క్లాసుల కోసం 5 కిలోమీటర్ల ప్రయాణం