తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలను చేపట్టిన వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్... ఆర్కే బీచ్‌లో ఉన్న విక్టరీ ఎట్ సీ వద్ద అమరులైన రక్షణదళాల సిబ్బందికి నివాళులు అర్పించారు. 1971 లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా .. అమర జవాన్లు, నావికా సిబ్బంది ఇతర రక్షణ రంగ సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ స్మారకం విశాఖలో నిర్మించారు.
ప్రతి జాతీయ పండుగల రోజున, తూర్పు నౌకాదళాధిపతి ఈ తరహాలోనే వచ్చి నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకోవడం ఆనవాయితీ. కొత్తగా బాధ్యతలను చేపట్టిన తూర్పు నౌకాదళాధిపతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించారు.
ఇదీ చదవండి:
తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్