సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ పర్మినెంట్ డ్రైవర్లతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాల్లో మాత్రం యాజమాన్యం వ్యత్యాసం చూపించటం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ మద్దిలపాలెం సిటీ బస్సు డిపో ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు పదేళ్ల నుంచి ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నా ఇప్పటికే తమకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేవని వాపోయారు. కనీసం బస్సు పాస్ సౌకర్యం కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఆర్టీసీ పర్మినెంట్ బస్సు డ్రైవర్లతో సమానంగా తమకు కూడా జీతాలు, లోను సౌకర్యాల కల్పనలో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన - problems of rtc temporary drivers
తమకు జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు విశాఖలో ఆందోళన చేపట్టారు. 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న తమకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.