ETV Bharat / city

'విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా భూసేకరణ పూర్తిచేయండి'

author img

By

Published : Sep 24, 2020, 10:46 PM IST

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్​కు త్వరితగతిన భూసేకరణ చేపట్టి, పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర పరిశ్రామలశాఖ డైరెక్టర్ జె.వి.ఎన్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. విశాఖలో అధికారులతో చర్చించిన ఆయన...కారిడార్​కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. కాపులుప్పాడ విద్యుత్ సబ్​స్టేషన్​ భూగర్భ కేబుల్ వ్యవస్థ అనుమతిపై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సుబ్రహ్మణ్యం సమీక్షించారు.

jvn subrahmanyam
jvn subrahmanyam

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జె.వి.ఎన్. సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్​లో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డితో కలిసి ఆయన ఇండస్ట్రియల్ కారిడార్​పై సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్​కు సంబంధించి భూసేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. కారిడార్​కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అభివృద్ధి పనులకు కేటాయించిన భూమిని సంబంధిత శాఖలకు అందజేయాలన్నారు.

నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో నెలకొల్పబోయే సబ్​స్టేషన్​కు భూమిని, అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు నిర్మించబోయే రహదారి, నక్కపల్లి నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్ వరకు చేసే రహదారులకు భూమి సేకరించాలని ఆదేశించారు. కాపులుప్పాడలోని విద్యుత్ సబ్​స్టేషన్ భూగర్భ కేబుళ్లు ఏర్పాటుకు అనుమతిపై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు డీపీఆర్​ను సమర్పించడంపై కూడా ఆయన సమీక్షించారు.

ఇదీ చదవండి : తగ్గినట్టే తగ్గి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 7855

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.