రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం(ఈఎన్సీ) వీక్షణ, వివిధ యూనిట్ల సందర్శన, నౌకాదళాధికార్లతో భేటీ అయ్యారు. ఈ ఉదయం 11.48 గంటలకు విశాఖ ఈఎన్సీకి...దిల్లీ నుంచి ఐఎఎఫ్ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజ్‌నాథ్‌కు నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎ.కె.జైన్, మంత్రి అవంతి శ్రీనివాసు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్వాగతం పలికారు. నేవీ హెలీకాప్టర్ ద్వారా నావికాదళంలోని వివిధ యూనిట్లు, స్థావరాలను ఆయన విహంగ వీక్షించారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నారు. సమీక్షల అనంతరం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
రాజ్‌నాథ్‌ను కలిసిన ముఖ్యమంత్రి
విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు.. విమానాశ్రయంలో మంత్రులు అవంతి, మోపిదేవి, ధర్మాన, ఉత్తరాంధ్ర వైకాపా నేతలు స్వాగతం పలికారు. కాసేపు నేతలతో ముచ్చటించిన సీఎం.. తూర్పు నౌకాదళ కార్యాలయానికి వెళ్లారు. ఈఎన్సీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. వారితో కలిసి విందులో పాల్గొన్న అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడనుంచి సీఎం నివాసానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి : మెున్న మెుదలైంది... అప్పుడే ఆగిపోయింది!