ఇదీ చూడండి:
'విశాఖలో రాజధాని వస్తే... రాయలసీమ ఫ్యాక్షన్ వచ్చినట్టే' - సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ. సత్య నారాయణమూర్తి మీడియా సమావేశం
విజయవాడ రాజధాని నగరంగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ. సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వస్తే... రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు, విశాఖ, విజయవాడలో హైకోర్టు ధర్మసనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనను స్వాగతిస్తున్నామని అన్నారు. రైతులను, ప్రజలను ఇబ్బందిపెట్టే ఆలోచనలను.. రాష్ట్ర ప్రభుత్వం చేయడం దురదృష్టమని అన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ. సత్య నారాయణమూర్తి మీడియా సమావేశం
sample description