శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ గర్భిణీ కరోనాతో బాధపడుతోంది. ఆపరేషన్ కోసమని విమ్స్ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమెకు సిజేరియన్ చేశారు. శనివారం సాయంత్రం పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విమ్స్ వైద్యులను కలెక్టర్ అభినందించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ ముందు.. తర్వాత.. గ్రాఫ్ ఇలా పెరిగింది