రాష్ట్రంలోకరోనా కేసులు రోజూపదులసంఖ్యలోవెలుగుచూస్తూనేఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 25 మంది వైరస్‌బారిన పడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 13 కర్నూలు నగరంలో 11 నంద్యాలలో, కోడుమూరులో ఒక్కోపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలోనే బాధితుల సంఖ్య 306కు, నంద్యాల పట్టణంలో 101కు పెరిగింది. కర్నూలు జిల్లాలో మొత్తం....కేసుల సంఖ్య 491గా ఉంది.
గుంటూరులో గజ గజ..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల్లో రెండోస్థానంలో ఉన్న గుంటూరు జిల్లాలోనూ బాధితులు ఎక్కువవుతూనే ఉన్నారు. సోమవారం 19 మందికి వైరస్ సోకింది. అందులో 7 కేసులు గుంటూరు నగరంలోకాగా.. 12 నరసరావుపేట పట్టణంలో నమోదయ్యాయి. నరసరావుపేటలో పాజిటివ్ కేసుల సంఖ్య 142కు పెరిగింది.
గుంటూరు అర్బన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్, వెంగళాయపాలెంలో కొత్త కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో ఇప్పటివరకూ కంటైన్మెంట్‌లోలేని శ్రీరాంపురం, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా నరసరావుపేటలో మరోమూడు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 3రోజుల పూర్తి లాక్‌డౌన్ అమలు చేసిన అధికారులు.. రేషన్, పింఛన్ల పంపిణీని దృష్టిలో పెట్టుకుని సోమ, మంగళవారాల్లో కాస్త సడలింపు ఇచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో బయటకొచ్చి గుమిగూడడంతో ఏడో తేదీవరకూ సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదేసమయంలో నరసరావుపేట నూతన మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు.. కరోనా కట్టడే తన ప్రాధాన్యమని స్పష్టంచేశారు
విశాఖలో అలా ఎలా?
మరోవైపు, విశాఖలో దాదాపు 4లక్షల జనాభా వరకూ కంటైన్మెంట్ పరిధిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కశింకోట వృద్దురాలికి వైరస్ నిర్థరణైన ఒకరోజులోనే.. విశాఖ నగరంలోని దండుబజార్, మాధవ ధార ప్రాంతాల్లో కేసులు రావడం అధికారుల్ని పరుగులు పెట్టించింది. ఈ రెండు కేసుల లింకుల్ని పరిశీలించగా ఇందులో... ఒక యువకుడు ఇళ్లలో మంచినీటి ఫ్యూరిఫైర్ల మరమ్మత్తుల కోసం పలు ఇళ్లకు వెళ్లినట్టు గుర్తించారు. విశాఖ జిల్లాలో కరోనా కేసులు దాచి పెట్టడంలేదని కొవిడ్ పరీక్షల సమన్వయకర్త సుధాకర్ స్పష్టం చేశారు. కేసుల వివరాల్ని నిష్ఫాక్షికంగా వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనాను దాచితే పూడ్చలేని నష్టం జరుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి : లాక్‌డౌన్ భగీరథులు: బోర్ కొట్టి బావులు తవ్వేశారు!