3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: యువజన కాంగ్రెస్ - మూడు రాజధానుల నిర్ణయంపై కాంగ్రెస్ వ్యతిరేకం న్యూస్
వైకాపా ప్రభుత్వం చేసిన 3 రాజధానుల ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి తెలిపారు. స్వలాభం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు అధికార వికేంద్రీకరణ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విశాఖలో అన్నారు.
Body:ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పెట్టాలనే వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి ఇవాళ విశాఖలో తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానికి అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార వికేంద్రీకరణ పేరుతో తన స్వలాభం కోసం మూడు రాజధానుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని రాకేశ్ రెడ్డి ఆరోపించారు విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వ పాలన గందరగోళంగా ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఏ ఒక్క పథకంలోనూ స్పష్టత లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా నిలిచిన పోలవరం ప్రాజెక్టును మధ్యలో నిలిపి వేయడంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఆయన పూర్తిగా మరిచిపోయారని ఎద్దేవా చేశారు ఏపీలో వైకాపా తెలుగుదేశం పార్టీలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో తెలిపి ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నట్లు చెప్పారు --------- బైట్ రాకేష్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు --------- ( ఓవర్).