సముద్రంలో చమురు కాలుష్యం...నౌకలపై అగ్ని ప్రమాదాల సమయంలో స్పందించాల్సిన తీరు, మత్స్యకారులకు అండగా ఉండడం వంటి అంశాలపై విశాఖలోని ఏయూలో కార్యశాల నిర్వహించారు. ఏయూలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ కోస్ట్ గార్డు సంయుక్తంగా ఈ కార్యశాలను ఏర్పాటుచేశాయి. తీర ప్రాంత గస్తీ దళానికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. తుపానులు, ఫిషింగ్ జోన్లు, మత్స్యకారుల హితమైన మొబైల్ యాప్, సముద్రంలో ప్రాణరక్షణ, డిస్ట్రస్ అలెర్ట్ ట్రాన్స్ పాండర్స్, హెలీకాప్టర్ ద్వారా రక్షణ వంటి అంశాలను అధికారులు వివరించారు.
నౌకాయాన పరిశ్రమ విస్తరించిన తర్వాత సిఫారర్స్ సంఖ్య పెరగడం, నౌకల సంఖ్య,రవాణా పెరగడం వంటివి జరగుతున్నాయని... దానివల్ల జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని కోస్ట్ గార్డు వివరించింది. ఈ దశలోనే సముద్ర రక్షణకు సంబందించిన ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాల అధికారులు...దీనిపై మరింత తాజా అంశాలను వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించింది.
ఇవీ చూడండి-'ఎడారిలో ఒయాసిస్సు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామోజీరావు