ETV Bharat / city

Danger journey : ఈ తాడు వదిలితే.. ప్రాణం వదిలినట్టే!

వాళ్లు ఊరు దాటాలంటే.. ముందుగా నది దాటాలి. ఏడాదిలో 365 రోజులూ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి.. ఇలాంటి నదిని వాళ్లు ఎలా దాటుతున్నారో తెలిస్తే.. షాకవ్వాల్సిందే! ఒకే ఒక తాడు పట్టుకుని వేళాడుతూ, నీటిలో నానుతూ.. గట్టెక్కుతున్నారు. దాదాపు 38 ఏళ్లుగా ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్న నాలుగు గ్రామాల ప్రజల అవస్థలు చూసి తీరాల్సిందే!

నదిపై ప్రమాదకరంగా ప్రయాణం
నదిపై ప్రమాదకరంగా ప్రయాణం
author img

By

Published : Oct 9, 2021, 5:38 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం మీదుగా పెద్దేరు నది(pedderu river) ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నదికి ఓ వైపు చాకిపల్లి(chakipalli), రామజోగిపేట(ramajogiperta) గ్రామలున్నాయి. వారి భూములు, పశువుల శాలలు, పొలాలు అన్నీ.. నదికి అవతలవైపున్న భోగాపురం(bhogapuram), పీఎస్‌ పేట(PS peta) గ్రామాల పరిధిలో ఉన్నాయి.

దీంతో.. పంట పొలాలు, పశువులను చూసుకోవడానికి, కూలి పనులకు ఆయా గ్రామాల ప్రజలు నిత్యం నది దాటాల్సిందే. ఉదయం నది అవతల ఊళ్లకు వెళ్లడం.. పనులు ముగించుకుని తిరిగి ఇళ్లు చేరడం నిత్యకృత్యం. ఎండైనా వానైనా ఉప్పెనొచ్చినా.. తాడు సాయంతో నదిని దాటక తప్పని పరిస్థితి వారిది.

నదిలో దిగకుండా చుట్టూ తిరిగి రావాలంటే రెండు గంటల సమయం పడుతుందంటున్నారు స్థానికులు.! అలా చేస్తే రవాణా(transport)కే రోజూ వంద ఖర్చు పెట్టాలని, కూలి డబ్బు చార్జీలకే సరిపోతుందని వాపోతున్నారు. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా.. నదిని దాటితే పది నిమిషాల్లోనే గమ్యం చేరిపోతామని చెప్తున్నారు. అయితే.. తాడు ఏమాత్రం చేజారినా నదిలో గల్లంతైపోతారు. ఒకటీ రెండు కాదు.. 38 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి.

నదిపై ప్రమాదకరంగా ప్రయాణం

ఇటీవల.. గులాబ్‌ తుపాను(gulab tuphan) సమయంలో నదిని దాటుతూ.. ఇద్దరు నీళ్లలో కొట్టుకుపోయారని, స్థానికుల చొరవతో ప్రాణాలు దక్కాయని చెప్తున్నారు. ఇప్పటికైనా తమ దుస్థితిని చూసి, నదిని దాటేందుకు చిన్నపాటి వంతెనను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీచదవండి.

MLA Baburao: ఎమ్మెల్యే బాబురావుతో కార్యకర్తల వాగ్వాదం...ఎందుకంటే..!

Sucharitha: 'ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలా?'..హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.