ETV Bharat / city

'బడ్జెట్​లో ఏపీ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించింది' - భారతీయ పరిశ్రమల సమాఖ్య వార్తలు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్​ బాగుందని సీఐఐ ఛైర్మన్ విజయ్​ నాయుడు అన్నారు. కార్పొరేట్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఏపీ గురించి ప్రస్తావించకపోవటం నిరాశజనకంగా ఉందని అన్నారు.

cii chariman on vijay naiudu galla budget 2020- 21

author img

By

Published : Feb 1, 2020, 5:41 PM IST

గతేడాది బడ్జెట్​తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఛైర్మన్ విజయ్ నాయుడు గల్లా అన్నారు. విశాఖలో ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించకపోవడం నిరాశజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించడం వల్ల ఏపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈటీవీ భారత్​తో సీఐఐ ఛైర్మన్ విజయ్ నాయుడు గల్లా

ఆదాయ పన్నులను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పేద, మధ్య తరగతి వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయని విజయ్​ నాయుడు గల్లా అన్నారు. డివిడెంట్ డిస్ట్రిబ్యూటర్ పన్ను తీసివేయడం వల్ల వ్యాపారులు తమ కంపెనీలను వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేట్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారు ఎలాంటి సందిగ్ధానికి గురికాకుండా ఉంటారని విజయ్​ నాయుడు అభిప్రాయపడ్డారు. బడ్జెట్​ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సీఐఐ తరఫున కేంద్రానికి నివేదిక పంపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మొండిచేయి: ఎంపీ విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.