విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు నవదిన ప్రార్ధనలు చేసిన అనంతరం... 8వ తేదీన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి కొండపై ఉన్న ప్రధాన దేవాలయంలో విశాఖ అగ్ర పీఠాధిపతి డా.మల్లవరపు ప్రకాష్ ఆధ్వర్యంలో ఆంగ్లం, తెలుగులో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది. మేరీమాతను దర్శించుకొని కొవ్వొత్తులు వెలిగించిన భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి :