మాజీ మంత్రి, తెదేపా నాయకుడు అయన్నపాత్రుడిపై విశాఖ మూడో పట్టణ పోలీసులు ఈ నెల 25న కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రౌడీరాజ్యమవుతుందని తాము ముందే చెప్పామని ఈ నెల 24న విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ పోలీసులపైనా ఘాటుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సెక్షన్ 153ఏ, సెక్షన్ 500, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. దీన్ని గుట్టుగా ఉంచారు. శుక్రవారం ఇది వెలుగులోకి రావడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాంతాల మధ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యలు చేశారని డీసీపీ-1 ఎస్. రంగారావు తెలిపారు. సీఎంపైనా తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఎ. వెంకటరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.
ఇదీ చదవండి :
విశాఖ ప్రెస్ క్లబ్లో 'జర్నలిస్టుల చట్టాలు-ఆవశ్యకత'పై సదస్సు