విశాఖ జిల్లా దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం వద్ద కారు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారులో డ్రైవర్ గమనించి ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.
ఇదీ చదవండీ... ఏపీ గవర్నర్కు అభినందనలు: ఉపరాష్ట్రపతి