ETV Bharat / city

వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడితే.. మద్దతిస్తా: "బ్రదర్" అనిల్‌ - బ్రదర్ అనిల్ తాజా వార్తలు

ఏపీలో ప్రత్యమ్నాయ పార్టీ ఏర్పాటుపై క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని క్రైస్తవ సంఘాలు, బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వారు ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నారని.. పార్టీ ఏర్పాటు చేస్తే కచ్చితంగా మద్దతిస్తానని అనిల్ స్పష్టం చేశారు.

వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడితే.. కచ్చితంగా మద్దతిస్తా

author img

By

Published : Mar 14, 2022, 3:38 PM IST

Updated : Mar 15, 2022, 5:08 AM IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదని, వారికి అన్యాయం జరుగుతోందని క్రైస్తవ మత బోధకుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఉత్తరాంధ్రకు చెందిన కుల, మత సంఘాల నాయకులతో ఆయన భేటీ అయి వారి సమస్యలను విన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... తన పిలుపు మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేశారని, వారి బాధలను వినాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ‘తమ మొరను ప్రభుత్వం ఆలకించడం లేదని, తమకు అన్యాయం జరిగిందని సంఘాల నాయకులు ఫిర్యాదులు చేస్తుండటంతో నేను విశాఖ వచ్చా. వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశించారు? ఏం కోల్పోయారు? తదితర విషయాలను నాకు వివరించారు. సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. తరువాత నాయకులను తీసుకెళ్లి సీఎంను కలిసే ప్రయత్నం చేస్తా. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే, ప్రత్యేక పార్టీ పెట్టుకుంటామని సంఘాల నేతలు చెబుతున్నారు. వారికి నేను పూర్తిగా మద్దతిస్తా. సీఎంను కలవడానికి నాకు అపాయింట్‌మెంట్‌ అవసరం లేదు. ఆయన్ను చూసి రెండున్నరేళ్లయింది. విజయవాడలో ఇటీవలి సమావేశం తర్వాత, ఉత్తరాంధ్రలో సమావేశం పెడతామని నాయకులు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చా. మిగతా ప్రాంతాలవారూ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా. కొత్త రాజకీయ పార్టీపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. వివేకా హత్యకేసులో న్యాయం జరిగి తీరుతుంది. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు శిక్షకు గురికాక తప్పదు. దోషులను సీబీఐ పట్టుకుంటుంది’ అని అనిల్‌ కుమార్‌ చెప్పారు.

వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడితే.. కచ్చితంగా మద్దతిస్తా

* బీసీ సంఘం నాయకుడు నాగరాజు మాట్లాడుతూ... బీసీని ముఖ్యమంత్రి చేసేలా పార్టీ పెట్టాలని తాము కోరగా త్వరలో శుభవార్త వింటారని బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారని తెలిపారు. అన్యాయమైన వర్గాలకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు కనీసం తమ సమస్యలు వినడానికీ సీఎం సమయం ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని అందుకే బీసీనే సీఎంను చేయాలని సమావేశంలో కోరగా అందుకు అనిల్‌ అంగీకరించారని వివరించారు.

* ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌(ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు హనోక్‌ మాట్లాడుతూ... వైకాపా విజయం కోసం ప్రార్థించి, కృషి చేసిన క్రైస్తవులకు అన్యాయం జరుగుతోందన్నారు.

"నేను రాజకీయ విషయాలు మాట్లాడను. నేనెప్పుడూ అసెంబ్లీ వైపు వెళ్లేవాడిని కాదు. నా బిజీలో నేను.. పథకాల బిజీలో సీఎం ఉన్నారు. అన్ని సమస్యలూ సీఎం దృష్టికి తీసుకెళ్తా. నేను సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయింది. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారు.. వారికి మద్దతుగా ఉంటా. ఎన్నికల ముందు నన్ను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది." -బ్రదర్ అనిల్

వివేకా హత్య కేసుపైనా స్పందించిన బ్రదర్ అనిల్.. దోషులు తప్పించుకోలేరని అన్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోందంటే చిన్న విషయం కాదని అన్నారు. త్వరలోనే దోషులెవరో తెలనుందని తెలిపారు.

ఇదీ చదవండి

HC on New Districts: కొత్త జిల్లాల పెంపు కేసు.. కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Last Updated : Mar 15, 2022, 5:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.