విశాఖలోని మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రిలోని మూలకణ మార్పిడి విభాగం సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ప్రాణాంతకమైన రక్త కేన్సర్లు లుకేమియా, మైలోమా, లింఫోమా వంటి వ్యాధులకు మరియు కేన్సర్ కాని తలసేమియా(రక్త హీనత), సికిల్ సెల్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి రక్తసంబంధిత వ్యాధులకు మూల కణ మార్పిడి (బీఎంటీ) ఒకే ఒక్క ప్రాణ రక్షక చికిత్సా విధానం. ‘సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ హెమటాలజీ అండ్ హేమాటో-ఆంకాలజీ’, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన అఫెరెసిస్, స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్, క్లాస్-10000 బీఎంటీ సూట్స్ వంటి వాటిని గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యంత అనుభవజ్ఞులతో పాటు అంకితమైన నిపుణుల బృందం దీనికి జత కావడంతో ఈ తరహా ఫలితాలను రాబట్టామని సంస్థ సీఎండీ డాక్టర్ మురళీ కృష్ణ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటి ప్రత్యేక బీఎంటీ యూనిట్. ప్రారంభ కాలంలో పూర్తి చికిత్సను భరించలేని పేద రోగులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌తో పాటు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంల సహాయం తీసుకున్నట్టు వివరించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం... వైయస్ఆర్-ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కింద ఆటోలోగస్ బీఎంటీని చేర్చటంవల్ల ఈ చికిత్సను రాష్ట్రంలోని పేద రోగులకు ఉచితంగా అందుబాటులోకి రానుంది.
ఇదీ చదవండి:
రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం.... 48 గంటల్లో తేల్చండి: చంద్రబాబు