ETV Bharat / city

'జగన్​... నీ గ్రాఫ్​ పడిపోతోంది.. జాగ్రత్త' - vishnu kumar raju

ప్రజావేదికను ఒక్కరోజులో కూల్చిన జగన్​... ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని భాజపా నేత విష్ణుకుమార్​ రాజు ప్రశ్నించారు. ప్రజల్లో జగన్​ గ్రాఫ్​ తగ్గిపోతుందని తెలిపారు.

విష్ణుకుమార్​ రాజు
author img

By

Published : Aug 17, 2019, 1:04 PM IST

Updated : Aug 17, 2019, 3:07 PM IST

విశాఖలో విష్ణుకుమర్​ రాజు మీడియా సమావేశం

ప్రభుత్వం పని తీరు చూస్తుంటే.. సీఎం జగన్​కు సరైన సలహాదారులు లేరనిపిస్తోందని భాజపా నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రజావేదికను ఒక్కరోజులో కూల్చిన జగన్​.... ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోనందున లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని విష్ణుకుమార్​ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కరోజులోనే అపాయింట్​మెంట్​ దొరికేదని... 70 రోజులైనా సీఎం జగన్ అపాయింట్​మెంట్​ లభించటం లేదని విష్ణుకుమార్​ రాజు అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. ప్రజల్లో జగన్ గ్రాఫ్ తగ్గిపోతోందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. అధికారులతో కుమ్మక్కయితేనే కాంట్రాక్టుల విషయంలో అవినీతి సాధ్యమని... కేవలం గుత్తేదారులనే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. మణిపాల్ గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఛైర్మన్ మోహన్‌దాస్‌ పాయ్ స్పందన సీఎం తెలుసుకోవాలని సూచించారు.

గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉండేది తేల్చుకోవాలని... ఓట్లు వేసిన విశాఖ ఉత్తర ప్రజలకు ఆయన అందుబాటులో ఉండాలని సూచించారు. గంటా భాజపాలోకి వచ్చినా స్వాగతిస్తామని విష్ణుకుమార్​రాజు తెలిపారు.

ఇదీ చదవండి

చంద్రబాబు నివాసానికి అధికారుల నోటీసులు

Intro:విజయనగరం జిల్లా
చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ కోసం తిరిగి ప్రారంభించాలని మరియు ఇసుక రీచ్ లో మళ్ళీ ప్రారంభించాలని భవన నిర్మాణ కార్మికుల తో కలిపి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చీపురుపల్లి మూడు రోడ్ల కూడలిలో మానవహారం

Body:5 రూపాయలతో పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ మూసివేయడం
ఈ జగన్ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యమని
త్వరలోనే అన్న క్యాంటీన్ తెరవాలని
లేకపోతే ఇంకా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కిమిడి నాగార్జున గారు మాట్లాడారు

Conclusion:అలాగే చీపురుపల్లి
ఇసుక రీచ్ లు కూడాప్రారంభించా లని
భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టవద్దని
ఇది రాజన్న రాజ్యం రాలేదని
పేదవాడి ఆకలిని కబళించే రాజ్యం లా ఉందని .
కిమిడి నాగార్జున గారు మండిపడ్డారు
Last Updated : Aug 17, 2019, 3:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.