![customer care numbers for battery cars booking](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5053544_vsp1.jpg)
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బ్యాటరీ కార్ల పెయిడ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవి 24 గంటలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని సర్వీసులను ప్రారంభించిన డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఆన్‌లైన్‌లోనూ ఈ సేవలు బుక్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. స్టేషన్‌లోని 8 ప్లాట్ ఫాంలలో బ్యాటరీ కార్ల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ప్రయాణికుడికి 45 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. రైలు నుంచి భారీ లగేజ్‌తో దిగిన వారితో పాటు.. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ఇవి సౌకర్యంగా మారనున్నాయి.