బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవిమా 80 మీటర్ల పొడవైన నౌక 2800 మెట్రిక్ టన్నుల క్వార్టైజ్ను మోంగ్లా పోర్టుకు తీసుకువెళ్లేందుకు విశాఖ తీరంలో యాంకరేజ్‌లో ఉంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకుని వచ్చింది. ఈ షిప్లో 41 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్, 9 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉంది. ఇదే విషయాన్ని షిప్ యజమానికి తెలియజేసి షిప్‌లోని అయిల్ను తీసేందుకు మెస్సర్స్ ఎంఎస్ గిల్ మెరైన్‌కు బాధ్యతలు అప్పగించారు. గిల్ మెరైన్ అయిల్ను తీసేందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వ సంస్ధల నుంచి తీసుకుంది.
అయితే షిప్ ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక రోడ్డును నిర్మించారు. షిప్ వద్ద పనులు చేపట్టేందుకు అవసరమైన మనుషులను సామగ్రిని తరలించేందుకు వీలుగా ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారు. షిప్ చుట్టూ ఎటువంటి అయిల్ లీకేజీ లేకుండా చూసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని పరికరాలను పంపించారు. షిప్ నుంచి ఆయిల్‌ను తొలగించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.
బీచ్‌లో ఎటువంటి ఆయిల్ కలవకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. షిప్‌లోని ఆయిల్‌ను తీసివేసిన తరువాత తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం షిప్ యజమాని ఎంఎస్ రిసాల్వ్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ షిప్లోనికి నీరు చేరడం గానీ షిప్ నుంచి ఆయిల్ లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. బంగ్లాదేశ్‌కు చెందిన 15 మంది సిబ్బంది ఇప్పటికీ షిప్‌లోనే ఉన్నారు. షిప్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఎంఎస్ గిల్ మెరైన్ సంస్ధ ఒక జనరేటర్‌ను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండీ... నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..