ETV Bharat / city

పక్క రాష్ట్రాల భయానికి జగన్ చర్యలే కారణం: అయ్యన్నపాత్రుడు - సీఎం జగన్ పై అయ్యన్న విమర్శలు

పొరుగు రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో గోడలు కట్టడానికి జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని... తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ayyana-fire-on-cm-jagan
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Apr 29, 2020, 8:30 PM IST

కరోనా కట్టడిలో సీఎం జగన్ చేతకానితనం వల్ల పొరుగు రాష్ట్రాలు భయపడిపోతున్నాయని... తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఆంధ్రా నుంచి ఎవ్వరూ తమ రాష్ట్రాలకు రావొద్దంటూ సరిహద్దుల వద్ద అడ్డుగోడలు పెడుతున్నాయన్నారు. పొరుగురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలు ఆంధ్రా వాసులకు భయపడుతున్నాయంటే ప్రభుత్వ అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూడా గ్రామానికి గ్రామానికి మధ్య ప్రజలే కంచెలు వేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. క్వారైంటైన్​లో ఉన్న వారికి నాసిరకం ఆహారం అందిస్తూ అక్కడ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వాలంటీర్ల సేవలు వినియోగించకుండా దాదాపు కోటి 45లక్షల మంది నుంచి వేలిముద్రలు సేకరిస్తూ క్యూలో నిలబెట్టి రేషన్ ఇవ్వడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సున్నా వడ్డీ పథకానికి ఎక్కడికక్కడ సభలు పెడుతూ కరోనా వ్యాప్తికి వైకాపా నేతలు కారణమవుతున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి...చిల్లర కోసం... సముద్ర తీరాన గంగపుత్రులు వెతుకులాట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.