ETV Bharat / city

నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్​ఆర్టీసీ - vizag rtc bus new look

ఏపీఎస్​ఆర్టీసీ నూతన ఆవిష్కరణలకు నడుం బిగించింది. ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విభిన్న సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను ప్రజలకు చేరువ చేసేందుకు చిరు ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మొదటి ప్రయత్నంగా విశాఖ నగరంలోని ఆర్టీసీ బస్సులకు రంగు రంగుల చిత్రాలు, చక్కటి ప్రదేశాల బొమ్మలను 3డీ విధానంతో పెయింట్​ వేశారు.

నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్​ఆర్టీసీ

author img

By

Published : Mar 2, 2020, 7:37 AM IST

నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్​ఆర్టీసీ

రంగు రంగుల బొమ్మలతో ఏపీఎస్​ఆర్టీసీ బస్సులు ఆకర్షణీయంగా మారనున్నాయి. విశాఖ నగరం పరిధిలో మొత్తం 600 ఆర్టీసీ బస్​లు ఉన్నాయి. వీటిని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఏపీఎస్​ఆర్టీసీ అధికారులు నడుం బిగించారు. సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బస్​లపై రక రకాల చిత్రాలు, చక్కటి ప్రదేశాల బొమ్మలను బస్సులపై 3డి పెయింట్ విధానంతో వేశారు. దీంతో బస్​లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. విశాఖలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ విధానంపై... ప్రజల నుంచి మరింత స్పందన లభిస్తే రాష్ట్రం వ్యాప్తంగా అన్ని నగరాల్లోని ఆర్టీసీబస్​లకు ఈ పెయింట్​ వేసేందుకు అధికారులు సిద్దమౌతున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బస్​లను ఈ విధంగా మార్చడం జరిగిందని ఆర్టీసీ క్రియాశీలక అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.