రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విశాఖ పర్యటన శాఖ సదస్సులో పాల్గొన్న మంత్రి విద్యుత్ అంతరాయాలపై మాట్లాడారు. ఏప్రిల్, మే నెలల్లో చేయవలసిన నిర్వహణ పనుల్లో.. అధికారుల ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. అందువలన ఆగస్టు నెలాఖరు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తేల్చి చెప్పారు. విశాఖ విమాన సర్వీసు సమస్యలపైనా స్పందించిన మంత్రి... ఆయా విమాన సంస్థలకు రూ. 23 కోట్లు చెల్లించాల్సి ఉందని, గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర వాసి కావడం వలన సర్వీసులు తిరిగాయని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. విమాన సర్వీసుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: