తెదేపాకు మద్దతుగా ఏపీ పెన్షనర్ల సంఘం తెదేపాకు మద్దతుగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ, తెదేపా మళ్లీ అధికారంలో రావాలని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలో ప్రచారం చేస్తూ పెన్షనర్లు...ఉద్యోగుల మద్దతు తెదేపా ప్రభుత్వానికి ఉండాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని చెప్తున్నారు. తెదేపా పాలనలో పెన్షనర్లకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు.