ETV Bharat / city

Justice Manavendranath Roy: 'భారత పౌరులుగా.. దేశానికి సేవలందించాలి' - విశాఖలో జస్టిస్​ సీహెచ్​ మానవేంద్రనాథ్​ రాయ్​

Justice Manavendranath Roy: విద్యార్థులు.. దేశ పౌరులుగా తమ దేశానికి సేవలందించాలని న్యాయమూర్తి జస్టిస్​ సీహెచ్​ మానవేంద్రనాథ్​ రాయ్​ అన్నారు. భారతీయ నేలపై పుట్టి, ఇక్కడే చదువుకుని ఇతర దేశాలకు వెళ్లి సంపాదించే వారికి ఇటీవల కాలంలో సొంత దేశం గురించి వ్యంగ్యంగా మాట్లాడడం ఒక ఫ్యాషన్​గా మారిందని వ్యాఖ్యానించారు.

Justice Manavendranath Roy
జస్టిస్​ సీహెచ్​ మానవేంద్రనాథ్​ రాయ్
author img

By

Published : Mar 5, 2022, 6:56 PM IST

Justice Manavendranath Roy: భారతదేశ పౌరుడిగా పుట్టి, ఈ దేశం ఇచ్చిన విద్యావకాశాలను వినియోగించుకున్నవారు.. దేశానికి సేవలందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సీహెచ్​ మానవేంద్రనాథ్​ రాయ్​ అన్నారు. భారతీయ నేలపై జన్మించి, చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి సంపాదించే వారికి.. ఇటీవల కాలంలో సొంత దేశ వనరులపై వ్యంగ్యంగా మాట్లాడడం ఒక ఫ్యాషనైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక్కడి విద్యావకాశాలు, వనరులను వినియోగించుకుని ఇతర దేశాలను పొగడటం సరికాదని హితవు పలికారు.

Justice Manavendranath Roy: విద్యార్థులు ముందుగానే తమ ఉద్యోగ లక్ష్యాలను నిర్దేశించుకుని.. సీనియర్లు, అధ్యాపకుల సహకారంతో తమ ప్రతిభాపాటవాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. తాము ఎంచుకున్న భవిష్యత్​లో ప్రతిభను ప్రదర్శించేందుకు, ఉన్నత అధికారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని జస్టిస్ మానవేంద్ర రాయ్ చెప్పారు. ఈ మేరకు విశాఖ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో.. విద్యార్థులు భవిష్యత్​ ప్రణాళిక రూపొందించుకోవడంపై ఆయన ప్రసంగించారు.

ఇదీ చదవండి: AP HRDI : విశాఖకు ఏపీ హెచ్‌ఆర్డీఐ తరలింపు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.