ETV Bharat / city

24 గంటల్లో.. బంగాళాఖాతంలో అల్పపీడనం - బంగాళాఖాతంలో అల్పపీడనం

రానున్న 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Another low monsoon thoopan in the Bay of Bengal in  next 24 hours
రానున్న 24గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
author img

By

Published : Jun 8, 2020, 7:55 PM IST

రానున్న 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి.. పశ్చిమ, వాయువ్య దిశగా కదలుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మంగళ వారం కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అనంతరం మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నైరుతీ రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం నిర్ధరించింది. ముందస్తు రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'హామీలు నెరవేర్చారో.. మోసాలకు పాల్పడ్డారో.. ప్రజలే చెబుతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.