ETV Bharat / city

విద్యార్థుల కళానైపుణ్యంతో.. రహదారులు మాట్లాడుతున్నాయ్​!

విశాఖ... ఓ సుందర నగరం. సాగరతీరం, ప్రకృతి రమణీయం. ఇప్పుడు విశాఖ సుందరీకరణకు విద్యార్థుల సృజనాత్మకత తోడైంది. నగరంలోని ప్రధాన రహదారుల గోడలు, ప్రముఖ ప్రదేశాలు సందర్శకులతో నేరుగా సంభాషిస్తున్నాయి. తమ వైపు ఓ లుక్​ వేయమని అడుగుతున్నాయి. ప్రకృతి పలకరిస్తున్నట్లుగా ఉన్న ఈ సుందర.. సుమనోహర చిత్రాల వెనుక ఓ నైపుణ్యం దాగి ఉంది.

Andhra university fine arts
Andhra university fine arts
author img

By

Published : Oct 5, 2020, 8:23 PM IST

కాదేదీ చిత్రకారుడి సృజనాత్మకతకు అనర్హం. కళాత్మక దృష్టి ఉంటే చాలు... రహదారి అయినా, ఎయిర్​ పోర్టు లాంజ్ అయినా... ఇట్టే చూడముచ్చటగా మారిపోతుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్​ లలిత కళల విభాగంలో చిత్రలేఖనం, శిల్పం అభ్యసించే విద్యార్థులు, అధ్యాపకులు...తీర్చిదిద్దిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా నగరంలోని ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రదేశాలు వీరి ప్రతిభ ప్రతిబింబిస్తున్నాయి.

విశాఖ విమానాశ్రయంలో స్థానిక విశేషాలకు దర్పణం పట్టేలా వివిధ చిత్రాలు రూపొందించారు. ఈ చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా ఒక వైవిధ్యభరితమైన ప్రాంతం. సాగర తీరం, గిరిజన సంస్కృతి, నగరమంతా కాస్మోపాలిటన్ కళ.. ఇలా వీటన్నింటిని చాటి చెప్పేలా ఈ చిత్రాలు పరుచుకున్నాయి. ఇవన్నీ అంధ్ర విశ్వవిద్యాలయం నిపుణులు ఇచ్చిన అలోచనలతో రూపుదిద్దుకున్నాయి.

నాలుగేళ్ల ఫైనార్ట్స్ అభ్యాసం, శిక్షణలో విద్యార్థుల సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం ఇస్తున్నామని ఆ విభాగం ఆచార్యులు పట్నాయక్ చెబుతున్నారు. ఫైన్ ఆర్ట్స్​ విభాగంలో నిష్ణాతులైన విద్యార్థులు... సినిమాల్లో రాణిస్తున్నారు. పలు సినిమాల ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో, యానిమేషన్ రంగంలో అవకాశాలు సాధిస్తున్నారు. ఈ అవకాశాలే వీరి ప్రతిభకు నిదర్శనం.

ఇదీ చదవండి:

తగ్గుతున్న పులస లభ్యత... కారణాల కోసం అన్వేషణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.