ETV Bharat / city

'ఏసీఐ' రేటింగ్​లో విశాఖ విమానాశ్రయం ప్రతిభ

ప్రతి 3 నెలలకోసారి విడుదలయ్యే ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) రేటింగ్‌ల్లో విశాఖ విమానాశ్రయం ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి కొన్ని విభాగాల్లో ముందు నిలిచింది.

author img

By

Published : Dec 7, 2020, 4:02 PM IST

'ఎసీఐ' రేటింగ్​లో విశాఖ విమానాశ్రయం ప్రతిభ

ప్రతి 3నెలలకోసారి విడుదలయ్యే ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) రేటింగ్‌ల్లో విశాఖ విమానాశ్రయం ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి కొన్ని విభాగాల్లో ముందు వరుసలో నిలిచింది. ఓవరాల్‌ రేటింగ్‌లు ఇలా ఉన్నాయి.

త్రైమాసికం రేటింగ్‌ ర్యాంకు
2018 అక్టోబరు-డిసెంబరు 4.55 79
2019 జనవరి-మార్చి 4.60 75
" ఏప్రిల్‌-జూన్‌ 4.53 88
" జులై-సెప్టెంబరు 4.23 160
" అక్టోబరు-డిసెంబరు 4.59 85
2020 జనవరి-మార్చి 4.63 79

ప్రయాణికుల సంతృప్తి స్థాయిలిలా..

త్రైమాసికం ప్రయాణికులిచ్చిన రేటింగ్‌ (ప్రపంచ సగటు)
2018 అక్టోబరు-డిసెంబరు 4.55 (4.22)
2019 జనవరి-మార్చి 4.60 (4.25)
" ఏప్రిల్‌-జూన్‌ 4.53 (4.24)
" జులై-సెప్టెంబరు 4.23 (4.22)
" అక్టోబరు-డిసెంబరు 4.59 (4.26)
2020 జనవరి-మార్చి 4.63 (4.24)

పరిమిత ప్రయాణికులు-అత్యున్నత ఏర్పాట్లు

  • కరోనా నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో ప్రత్యక చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల భద్రత, వేగవంతమైన స్క్రీనింగ్, ఇతర ధృవపత్రాల పరిశీలన, పనితీరులో సిబ్బంది చాలా చురుగ్గా వ్యవహరించింది.
  • పాస్‌పోర్టు పరిశీలన, ఐడీ వెరిఫికేషన్‌ విభాగాల్లో అత్యున్నతంగా వృద్ధి చెందాయి. అక్కడి వేగానికి ప్రయాణికులు పూర్తి సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
  • పార్కింగ్, ట్రాలీ సదుపాయం, సిబ్బంది పనితీరు, భద్రత, విమాన సర్వీసుల సమయాల ప్రదర్శన, టెర్మినల్‌ లోపల నడక వసతి, వైఫై, బ్యాగేజీ డెలివరీ, కస్టమ్స్‌ అధికారుల పరిశీలన తదితర విభాగాల్లో గతం కంటే మెరుగ్గా ఉన్నట్లు ఫలితాలొచ్చాయి.

ఇంకాస్త..

2019-20 సంవత్సరానికి ప్రతీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.68 రేటింగ్‌ ఉంటేనే అత్యుత్తమ ప్రమాణమని ఎయిర్‌పోర్టు కౌన్సెల్‌ ఇంటర్నేషనల్‌ నిర్ణయించింది. 0.05 తక్కువ రేటింగ్​తో విశాఖ విమానాశ్రయం ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి 79వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 75వ ర్యాంకు సాధించింది. దేశంలో తొలిర్యాంకు, అంతర్జాతీయంగా 21వ ర్యాంకు సాధించిన వారణాసి ఏకంగా 4.97 రేటింగ్‌ సాధించింది.

ఇదీచదవండి

ఏలూరు: ప్రజలకు అస్వస్థతపై సీఎం సమీక్ష.. సమస్యపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.