వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ విశాఖ జిల్లా బధిరుల సంఘం ఆందోళనకు దిగింది. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. గత మూడేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న తమ కోటా ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో తమకు న్యాయంగా ఇవ్వాల్సిన మూడు శాతం రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవ్వకుండా కొద్ది పాటి ఉద్యోగాలతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేటు సంస్థల్లో సైతం తమకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మెడికల్ బోర్టులు జారీ చేసే సర్టిఫికేట్ లలో ఎక్కువ శాతం వికలాంగత్వం రాసి ఇస్తున్నారని వాపోయారు. దీని వల్ల పుట్టుకతో మూగ వారైన తమలాంటి వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :