విశాఖ గాజువాక దరి కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన కొట్టె ప్రవీణ్ కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంలో పని చేస్తున్నారు. ఈయన కు భార్య పావని (32), కుమారులు రాకేశ్(8), రోహిత్ (6) ఉన్నారు. మూడు రోజుల క్రితం పావని విశాఖలోని పెందుర్తి నల్లక్వారీ కాలనీలోని తల్లి వద్దకు పిల్లలతో కలిసి వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో చినుకులు ప్రారంభమయ్యాయి.
డాబాపై ఆరేసిన బట్టలు తీసేందుకు పావని మేడపైకి వెళ్లారు. ఆమె వెంటే చిన్నకుమారుడు రోహిత్ కూడా వెళ్లాడు. మేడపై ఉన్న వారిద్దరిపై హఠాత్తుగా పిడుపుపడింది. పిడుగు(Thunder bolt) పాటుకు తీవ్ర గాయాలైన రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పావనిని కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెందుర్తి ఎస్సై శ్రీను ప్రాథమిక వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పావని ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: