- మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు
గుంటూరులో తెదేపా అధినేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు రోడ్‌షోకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పుర పోరులో మగువ తెగువ.. బరిలో 58.18 శాతం అభ్యర్థినులు
విశాఖ మహా నగర పాలక సంస్ధ ఎన్నికల్లో ఓటర్లలో దాదాపు సరిసమానంగా , పోటీ చేస్తున్న అభ్యర్ధుల పరంగా మహిళలే అధిక శాతంగా ఉన్నారు. జనరల్ స్దానాల్లో సైతం మహిళలు పోటీ పడడం వీరి సమర్ధతకు అద్దంగా నిలుస్తోంది. మొత్తం పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో 53 శాతానికి మించి ఉండడం వారి చైతన్యానికి ప్రాధాన్యతను చాటి చెబుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విమెన్స్ డే ప్రత్యేకం: ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!
ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు, వినోదం.. ఇలా తమ తమ ఇష్టాయిష్టాలను బట్టి ప్రతి రంగంలోనూ అడుగుపెడుతున్నారు మహిళలు. అయితే ఏ రంగంలో చూసినా మగువలకు పురుషులతో సమాన అవకాశాలు దక్కట్లేదనే చెప్పాలి. ఒకవేళ దక్కినా అందుకు సమాన వేతనం అందుకోలేకపోతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రతిపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పెరుగుతున్న చమురు ధరలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభాపతి సభను వాయిదా వేశారు. రేపటి నుంచి రాజ్యసభ కార్యక్రమాలు సాధారణంగానే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయని ఛైర్మన్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మహిళలు.. చరిత్ర సృష్టించగల సమర్థులు'
మహిళలు చరిత్ర సృష్టించగల సమర్థులని కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో అతివలకు అవకాశాలు ఇవ్వటమే మహిళా సాధికారత అని .. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా'
అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు మేఘన్ మార్కెల్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కుటుంబ ఆర్థిక భద్రతకు మహిళా భరోసా
మారిన కాలంతో పాటే సామాజంలో, కుటుంబంలో మహిళల ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో పురుషులే కాకుండా మహిళలూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి మహిళలు తనకు, తన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు పాటించాల్సిన ఆర్థిక సూత్రాలు ఏమిటి? అనే అంశంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టెస్టు సిరీస్ ఓటమికి వారిద్దరే కారణం: సిల్వర్‌వుడ్
టెస్టు సిరీస్‌లో తమ ఓటమికి భారత స్పిన్ ద్వయం అక్షర్, అశ్వినే కారణమని ఒప్పుకొన్నాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్. నాలుగు టెస్టుల్లో వారిద్దరే 59 వికెట్లు తీశారంటే.. వారి ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపాడు. ఈ ఓటమి కొంత కాలం తమని బాధిస్తుందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సుశాంత్ డ్రగ్ కేసు: ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఒకడు సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడని తెలిసింది. వీరి నుంచి అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.