ETV Bharat / city

MALLADI VISHNU: 'ప్రజల ప్రాణాలే ముఖ్యం.. అందుకే పండుగ ఇళ్లకే పరిమితం' - vijayawada news

వినాయక చవితి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భాజాపా నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చకొట్టే విధంగా మాట్లాడడం మాని.. వాస్తవాలను పరిశీలించాలని హితవు పలికారు.

MALLADI VISHNU
MALLADI VISHNU
author img

By

Published : Sep 5, 2021, 6:46 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా వినాయక చవితికి పందిళ్లు వేయకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనను.. భాజపా నేతలు వక్రీకరిస్తున్నారని వైకాపా ఆరోపిస్తోంది. పండుగలపై రాష్ట్రంలో అబద్దాలు ప్రచారం చేస్తూ హిందువులను రెచ్చగొట్టేలా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.

కరోనా కట్టడికోసం బహిరంగ ప్రదేశాల్లో రద్దీ లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని.. దాన్ని సోము వీర్రాజు ముందుగా గమనించాలని హితవుపలికారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి అన్ని సామాజిక వర్గాలూ సమానమేనన్న మల్లాది.. రంజాన్, బక్రీద్​లకూ గతంలో ఇదే తరహాలో ఆంక్షలు విధించామన్నారు.

హిందువుల పట్ల భాజపాకు ఎంత ప్రేమ ఉందో అంతర్వేది ఘటనపై విచారణ అంశం తేటతెల్లంచేస్తోందని మల్లాది అన్నారు. అంతర్వేది రథం దగ్ధంపై ఇప్పటి వరకూ సీబీఐ విచారణ ప్రారంభించకపోవడంపై ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరి ప్రాణం ప్రభుత్వానికి ఎంతో విలువైనదేనని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా స్వామీజీలు వ్యవహరించవద్దని కోరారు.

ఇదీ చదవండి:

AP Corona Cases: కొత్తగా 1,623 కరోనా కేసులు, 8 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.