తెలంగాణలో తన పార్టీ బలోపేతంపై ముఖ్య అనుచరులతో వైఎస్ షర్మిల లోటస్ పాండ్లో సమావేశం అయ్యారు. పార్టీ ప్రారంభానికి ముందుగానే మండల స్థాయి కమిటీలు నియమించాలని నిర్ణయించారు. ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 16లోపు కమిటీల ఏర్పాటు కోసం ముఖ్య అనుచరుడు పిట్టా రామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
వైఎస్ షర్మిలకు ముందు నుంచి అండగా ఉన్న వైఎస్సార్ అభిమానులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న ఇవాళ వైఎస్ షర్మిళను కలిశారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను షర్మిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు