ఆన్‌లైన్ టికెట్లపై.. జనసేన అధినేత పనన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని.. బురద చల్లాలని చూస్తే పవన్ కల్యాణ్‌కే ఇబ్బందిగా మారుతుందని అన్నారు.
సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నాం. బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందిగా మారుతుంది. పవన్‌ను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. పవన్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ద్వారా పారదర్శకత సాధ్యం. పవన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మటన్ షాపులు పెడతారన్న ప్రచారంలో వాస్తవం లేదు. మటన్ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏ అంశాలు లేనందువల్లే ఏదో ఒక విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
కడప జిల్లాలోని బద్వేలులో జరగాల్సిన ఉపఎన్నికలో.. తమ పార్టీ తప్పకుండా గెలుస్తుందని సజ్జల అన్నారు. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని.. ప్రజల అభిమానం, ఆదరణ పార్టీకి ఉంటుందన్నారు.
ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ప్రజల అభిమానం, ఆదరణ పార్టీకి ఉంటుంది. మేమేం చేశామో ప్రజల ముందుకు తీసుకెళ్తాం. బద్వేలులో మంచి మెజారిటీతో గెలుస్తాం. - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు.
ఇదీ చదవండి:
By Election Schedule 2021: బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల