ETV Bharat / city

'రాష్ట్రంలో కరోనా విజృంభణకు జగన్​ విధానాలే కారణం' - former minister yanamala ramakrishna

రాష్ట్రంలో మెుదటి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప కరోనా తీవ్రతను పట్టించుకోలేదని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైరస్​ నివారణకు అన్ని రాష్ట్రాలు, దేశాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంతో ఉందని అన్నారు.

yanamala ramakrishna comments on cm jagan
మాజీ మంత్రి యనమల రామకృష్ణ
author img

By

Published : Apr 22, 2020, 6:01 PM IST

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందటానికి కారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానాలే కారణమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్​ రాజకీయాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా పరీక్షల్లో వాస్తవాలు దాచిపెడుతూ... తప్పుడు లెక్కలు విడుదల చేస్తున్నారని యనమల ఆరోపించారు. కరోనా కట్టడికి కేంద్ర సహాయం అందుతున్నా.. వాటిని తన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

ఉత్పత్తిపై దృష్టి పెట్టకుంటే ప్రమాదమే

భవిష్యత్తులో ఆహార ఉత్పత్తి అంతగా ఉండకపోవచ్చని... ఈ పరిస్థితుల్లో రైతు ఉత్పత్తి కొనుగోళ్లపై దృష్టిపెట్టకపోవటం అత్యంత ప్రమాదకరమని యనమల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. అందుకు తగిన విధంగా పరీక్షలు చేసే పరిస్థితి లేదన్నారు. ర్యాపిడ్​ కిట్ల కొనుగోళ్లలో అవినీతి మాత్రం స్పష్టంగా బయటపడిందన్నారు.

ఇవీ చదవండి...

ఏనుగులతో వేగేదెట్ల?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.