స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా.. బీసీలను వైకాపా మోసం చేస్తోందనే విషయం కోర్టు తీర్పుతో స్పష్టమైందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బీసీలకు అమలు చేసే ఎన్నో పథకాలు ఇప్పటికే నిలిపి వేశారని ఆరోపించారు. బడ్జెట్లోనూ సంక్షేమానికి కోత విధించారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ఎన్నికలను వాయిదా వేయించేందుకే ఇలాంటి రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందని యనమల దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: