కళా వెంకట్రావు అరెస్టు, తిరుపతిలోని తెదేపా నాయకుల నిర్బంధాన్ని.. మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. నరసింహయాదవ్పై పోలీసుల దౌర్జన్యం చేయటంపై యనమల మండిపడ్డారు. అజాత శత్రువు కళా వెంకట్రావుపై సెక్షన్ 307 పెట్టడం కన్నా నీఛం మరొకటి లేదంటూ... దుయ్యబట్టారు. మందులు వేసుకోనివ్వకుండా, భోజనం చేయనీయకుండా బలవంతంగా కళా వెంకట్రావును పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లటం అమానుషమని ఆవేదన చెందారు.
'నోటీసు ఇచ్చేందుకు వందలాది పోలీసులను కళా వెంకట్రావు ఇంటికి పంపిస్తారా? విచారణకు స్టేషన్కు పిలిపించాలంటే.. అంతమందిని పంపించాలా? ఇదేనా మాజీ హోం మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యునిగా, 4 శాఖల మంత్రిగా పని చేసిన నాయకుడి పట్ల మీ ప్రవర్తన?' అని పోలీసులను యనమల నిలదీశారు.
ఇదీ చదవండి: