ETV Bharat / city

Autonagar Bandh: 50 శాతం పన్ను కట్టాలంటే మా వల్ల కాదు: వ్యాపారులు - విజయవాడ ఆటోనగర్ లో స్వచ్ఛంద బంద్

Bandh in autonagar: ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నెంబర్ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ఆటోనగర్​లో కార్మికులు, వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. ఆటోనగర్ పారిశ్రామిక వాడను కమర్షియల్​గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు.

workers and businessmen held voluntary bandh in autonagar at vijayawada
విజయవాడ ఆటోనగర్ లో స్వచ్ఛంద బంద్
author img

By

Published : Apr 7, 2022, 11:42 AM IST

విజయవాడ ఆటోనగర్ లో స్వచ్ఛంద బంద్

Bandh in autonagar: విజయవాడ ఆటోనగర్​లో కార్మికులు, వ్యాపారులు ప్రభుత్వం జారీ చేసిన 5, 6నెంబర్ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల జీవో తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్​కు తాజా జీవోల నుంచి వెసులుబాటు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్​గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తూ 50శాతం పన్ను కట్టమని తెచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ బంద్ చేపట్టినట్లు కార్మిక, వ్యాపార వర్గాలు తెలిపాయి. 50 శాతం పన్ను కట్టాలంటే మా వల్ల కాదని వ్యాపారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Flexi issue: పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.