ETV Bharat / city

NITI AAYOG: అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో ఏపీ నెం-1! - vijayawada news

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్​ సాంధించిన ఫలితాలను నీతి ఆయోగ్ సలహాదారు సంయుక్తా సమాదార్ వెల్లడించారు. నిర్ధేసించుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్రస్థాయి కార్యశాలలో ఆమె తెలిపారు.

NITI AAYOG
NITI AAYOG
author img

By

Published : Aug 12, 2021, 8:36 PM IST

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఇండియా ఇండెక్స్- 2020 నివేదిక ప్రకారం అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని నీతి ఆయోగ్ సలహాదారు సంయుక్తా సమాదార్ స్పష్టం చేశారు. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యం-14 లో భాగంగా లైఫ్ బిలో వాటర్ అంశంలో 2వ స్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యం-6లో భాగంగా సురక్షిత మంచినీరు, పరిశుభ్రత అంశాల్లో 4వ స్థానంలోనూ, జెండర్ ఈక్వాలిటీ అంశంలో 5వ స్థానంలో నిలిచినట్టు ఆమె వివరించారు.

రెండు రోజుల వర్క్​షాప్​..

సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కార్యశాలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు.. వాటి సాధనలో ఆంధ్రప్రదేశ్ పనితీరు అంశంపై విశ్లేషించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వర్క్ షాప్ లో నీతి ఆయోగ్ సలహాదారు సంయుక్తా సమాదార్ సహా ఏపీకి చెందిన ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయకుమార్ సహా వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు ముఖ్యకార్యదర్శులు ఇతర అధికారులు హాజరయ్యారు. నీతి ఆయోగ్.. నోడల్ ఏజెన్సీ గా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను గమనిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

HC On YSR Statue: వైఎస్ విగ్రహం ఏర్పాటు ఆపాలని పిటిషన్.. హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.