విజయవాడ నగర శివారు కండ్రిక ప్రాంతంలోని 64వ డివిజన్ పరిధిలో... వారం రోజులుగా నీటి సమస్య ఏర్పడింది. స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. సీపీఎం నాయకులు మద్ధతు తెలిపారు. రంజాన్ నెలలో మంచినీటి సమస్యతో పండగ కూడా చేసుకోలేకపోతున్నామని.. ముస్లిం కుటుంబాలు ఆవేదన చెందాయి.
మున్సిపల్ అధికారులకు కొద్దిపాటి మరమ్మతులు చేసి కేవలం రోజుకు గంట మాత్రమే నీరు అందిస్తున్నారని... స్థానిక మహిళలు వాపోయారు. కనీసం ట్యాంకర్లతో అయినా నిత్యం నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: