డ్యాన్స్ ట్రూప్, థ్రిల్లింగ్ రైడ్స్, స్టిల్ట్ వాకర్స్, మైమరిపించే సంగీతాలు, జగ్లర్లు, తమాషా వేషధారణలు.. రంగురంగుల విద్యుద్దీపాలు, ఆటపాటలు ఇలా మరెన్నో విశేషాలతో సందర్శకుల్లో శీతాకాలపు ఉత్సాహాన్ని నింపుతోంది రంగుల ప్రపంచం రామోజీ ఫిల్మ్‌సిటీ. లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్‌లో భాగంగా అట్టహాసంగా ప్రారంభమైన సంబరాలు జనవరి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు ప్రత్యేక వినోదాలు, సాయంత్రం వేళ కార్నివాల్ పరేడ్‌లు సందర్శకులను ఎంతగానో అలరించాయి.
కార్నివాల్ పరేడ్‌లో పర్యాటకుల సందడి
ఫిల్మ్‌సిటీ గార్డెన్లు, మార్గాల మధ్య సాగిన కార్నివాల్ పరేడ్‌లో పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొని వినువీధుల్లో విహరించిన అనుభూతిని పొందారు. సకుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో వచ్చి ప్రకృతి రమణీయ ఉద్యానవనాలు, పక్షుల కిలకిలారావాలను ఆస్వాదించారు. వినోదాన్ని పంచే చలనచిత్ర విశేషాలను కళ్ల ముందుంచే అద్భుతసెట్లు, లైవ్ స్టంట్ షోలు, మూవీమ్యాజిక్, ఫిల్మీదునియా, ఆనందతీరాలకు చేర్చే రామోజీ స్టూడియో టూర్.. ఇలా ప్రతీది పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు
ఫిల్మ్‌సిటీ పర్యటన ఎన్నో మధురానుభూతిని మిగిల్చిందని మళ్లీ మళ్లీ వచ్చినా తనివితీరదని పర్యాటకులు చెబుతున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్‌ను మరింతగా ఆనందించేలా అవకాశం కల్పిస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి: