User Charges: యూజర్ ఛార్జీల వసూలు పని భారాన్ని తగ్గించాలంటూ.. వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ఆందోళనకు దిగారు. ప్రజా ఆరోగ్యం, అత్యవసర సేవల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూజర్ ఛార్జీలు వసూలు చేయాలంటూ … వేధింపులకు గురి చేయడం తగదంటూ.. వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూజర్ ఛార్జీల వసూల సమయంలో ప్రజల నుంచి అనేక అవమానాలను, ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. యూజర్ ఛార్జీలు వసూలు కాకపోతే షోకాజు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యూజర్ ఛార్జీలు వసూళ్లను, పని ఒత్తిడి భారన్ని తగ్గించి సెలవులు మంజూరు చేయాలని పని గంటలను నిర్దేశించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Suspension: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసు.. 17మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్