Vundavalli Arun kumar on PRC issue: రాష్ట్రంలో పీఆర్సీ అంశం.. ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశామని.. కానీ పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసుకు సిద్ధమవడం ఇదే ప్రథమమని అన్నారు. పాత జీతాలే చాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా పరిస్థితులు, ఆర్థిక దుస్థితి దృష్ట్యా.. సమ్మె ఆపాలని ఉద్యోగులను ఉండవల్లి కోరారు. ప్రభుత్వం, ఉద్యోగులు.. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:
HC Employees Agitation on PRC : పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన...