ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల నుంచి 300 మంది విద్యార్ధులు అత్యధిక ప్యాకేజీలతో ఎంపికయ్యారని విజయవాడ వీఆర్ సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రకటించింది. కళాశాలలో ప్రాంగణ ఎంపికలో అవకాశం పొందిన విద్యార్ధులతో సిద్దార్ధ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, ఇతర విబాగాధిపతులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
కరోనా కారణంగా కఠిన పరిస్థితులను అధిగమించి తమ విద్యార్ధులు అమెజాన్ సంస్థలో రూ.19 లక్షలు, సిస్కోలో రూ.15లక్షలు, మైక్రోసాఫ్ట్‌లో రూ.12లక్షలు, ఆడోబ్‌లో రూ.12 లక్షల వార్షిక వేతనాలతో కొలువులు సాధించడం సంతోషదాయకమంటూ విద్యార్ధులను అభినందించారు.
ఇవీ చదవండి..