ETV Bharat / city

పోగొట్టుకున్న బ్యాగును బాధితుడికి అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు - విజయవాడ ట్రాఫిక్ పోలీసులు

ఒక వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు అతనికి అప్పగించారు. ట్రాఫిక్ సిబ్బందికి సదరు వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు.

vijayawada traffic police returned lost bag to victim
పోగొట్టుకున్న బ్యాగును బాధితుడిన అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు
author img

By

Published : Sep 19, 2020, 4:44 PM IST

ఒక వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు అతనికి అప్పగించి అందరి మన్ననలు పొందారు. ఫైజుల్లా బాషా అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద తన బ్యాగు పోగొట్టుకున్నాడు.

అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ బ్యాగును గమనించి తనిఖీ చేయగా అందులో అడ్రస్, ఫోన్ నెంబర్ లభించాయి. వెంటనే బాధితుడికి సమాచారం ఇవ్వగా అతను వచ్చి బ్యాగు తీసుకున్నాడు. అందులో తన తల్లికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, కొంత నగదు, ఫోన్ ఉన్నట్లు తెలిపాడు. పోగొట్టుకున్న బ్యాగును తిరిగి ఇచ్చిన ట్రాఫిక్ సిబ్బందికి ఫైజల్ బాషా కృతజ్ఞతలు చెప్పాడు.

ఇవీ చదవండి...

డిసెంబరు 20న ఏపీ సెట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.