కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఘాట్‌రోడ్డుపై నుంచి రాకపోకలు ఆపేశారు. ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో సురేష్‌బాబు దగ్గరుండి... శుక్రవారం అమ్మవారి ఆలయానికి వచ్చిన వారిని త్వరగా దర్శనం చేయించి కొండ నుంచి దిగువకు పంపించేశారు. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు వేదపండితులతో యథావిధిగా జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. వైరస్ ప్రభావం తగ్గేంత వరకు భక్తులను రావొద్దని సూచించారు.
ఇదీ చదవండి :