మూడేళ్ల కిందట విజయవాడలో సంచలనం రేపిన బంగారం దొంగతనం కేసులో కీలక నేరస్తుడు బల్బీర్ సింగ్, బల్వంత్ సింగ్ రావత్ ఆచూకీ దొరికొంది. ముంబయి యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ బల్బీర్ సింగ్ను కొద్దిరోజుల కిందట అరెస్ట్ చేశారు.
మావోయిస్టులకు బల్బీర్ కు సంబంధాలున్నాయని పక్కా సమాచారంతో ఏటీఎస్ బృందం అతన్ని అరెస్ట్ చేసింది. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. మూడేళ్ల కిందట సంచలనం రేపిన దోపిడీ కేసులో కీలక నిందితుడని తేలింది. దోచిన సొత్తును మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు .
2017 జూలైన11న రద్దీ సమయంలోనే కత్తులు, తుపాకులతో బెదిరించి విజయవాడలో ఆరుగురు నిందితులు లక్షల రూపాల విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై ప్రత్యేక బృందాలు ముంబయి వెళ్లి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి 4 కేజీలకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కీలక నిందితుడు బల్బీర్ సింగ్ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిందితుడు పరారీ లోనే ఉన్నాడు. ముంబయి పోలీసుల విచారణలో బయటపడటంతో విజయవాడ పోలీసులకు సమాచారమిచ్చారు. బల్బీర్ ను మహారాష్ట్ర నుంచి విజయవాడ తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి