ETV Bharat / city

పూర్తిగా వరద తగ్గాకే ఇళ్లకు పంపిస్తాం: కమిషనర్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరద నీరు పూర్తిగా తగ్గాకే బాధితులను తిరిగి ఇళ్లకు పంపిస్తామని కమిషనర్ వెల్లడించారు.

పూర్తిగా నీరు తగ్గాకే బాధితులు ఇళ్లకు : కమిషనర్ ప్రసన్న వెంకటేశ్
author img

By

Published : Aug 20, 2019, 9:59 PM IST

పూర్తిగా నీరు తగ్గాకే బాధితులు ఇళ్లకు : కమిషనర్ ప్రసన్న వెంకటేశ్

కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని కమిషనర్, ఎమ్మెల్యే సందర్శించారు. క్రెడాయ్, ట్రెండ్ సెట్ మాల్, హోటళ్ల సంఘం ప్రతినిధుల వరద బాధితులకు దుప్పట్లు, దుస్తులు అందించారు. వాటిని శిబిరంలో ఉన్నవారికి పంపిణీ చేశారు. వరదనీరు తగ్గేందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందన్న కమిషనర్.... అప్పటి వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉంటారని చెప్పారు. వరద కారణంగా పేరుకుపోయిన బురదను తొలిగించడానికి నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బాధితులను ఇళ్లకు తరలిస్తామని స్పష్టం చేశారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

మధ్యాహ్న భోజనాన్ని తిరిగి అమలు చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి.

గత ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉదయం ఇంట్లో నుండి భోజనం చేసుకొని కళాశాలకు రావడం ఇబ్బందిగా మారిందని, వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రారంభించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను, కాస్మటిక్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఉరవకొండ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని వారు తెలిపారు. మధ్యాహ్న భోజనం అమలు చేయకపోతే రాబోవు రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.

Body:బైట్ 1 : రమేష్, sfi జిల్లా కార్యదర్శి
బైట్ 2 : త్రిశంజలి, విద్యార్థిని
బైట్ 3 : గౌరి, విద్యార్థిని

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 20-08-2019
sluge : ap_atp_71_sfi_dharna_midday_meals_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.